Current Affairs in Telugu 01 September 2025
Table of Contents
PIB కరెంట్ అఫైర్స్
SCO సమ్మిట్ 2025
- SCO సమ్మిట్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1, 2025 వరకు చైనాలోని టియాంజిన్‌లో జరిగింది.
- SCO సమ్మిట్‌ను చైనా నిర్వహించడం ఇది 5వ సారి.
- బీజింగ్‌ను టియాంజిన్ మరియు బోహై సముద్రాన్ని కలిపే చైనీస్ నది హై (Hai) వద్ద ఈ సమావేశం జరిగింది.
SCO సమ్మిట్ 2025 థీమ్
- పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం.
- తీవ్రవాదం, మాదక ద్రవ్యాలు మరియు అంతర్జాతీయ నేరాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ భద్రతా సహకారం.
- ఆర్థిక ఏకీకరణ: SCO కింద కొత్త ఆర్థిక విధానాల కోసం ప్రతిపాదనలు.
కీలక ఫలితాలు
- టియాంజిన్ డిక్లరేషన్‌ను నాయకులు ఆమోదించారు.
- SCO అభివృద్ధి వ్యూహం 2026–2035.
- ఒక SCO యాంటీ-డ్రగ్ సెంటర్ శాశ్వత సంస్థగా స్థాపించబడుతుంది, దీని ప్రధాన కార్యాలయం దుషాన్‌బేలో ఉంటుంది.
- సభ్య దేశాల భద్రతకు సవాళ్లు మరియు బెదిరింపులను ఎదుర్కోవడానికి SCO యూనివర్సల్ సెంటర్ కూడా తాష్కెంట్‌లో శాశ్వత సంస్థగా ఏర్పాటు చేయబడుతుంది.
- SCO యూనివర్సల్ సెంటర్‌లో ఒక శాఖగా బిష్‌కెక్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేంద్రం ఏర్పాటు.
SCO సభ్య దేశాలు
- 2025 నాటికి, SCOలో 10 మంది సభ్య దేశాలు ఉన్నాయి.
- చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ మరియు బెలారస్.
‘మన్ కీ బాత్’ 125వ ఎపిసోడ్ ముఖ్యాంశాలు
- దేశంలోనే మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో జరిగింది. అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా.
- రష్మితా సాహు – ఒడిశాకు చెందిన కెనోయింగ్ ప్లేయర్.
- ‘ప్రతిభా సేతు’ – ‘ప్రతిభా సేతు’ UPSC యొక్క వివిధ పరీక్షల యొక్క అన్ని దశలను క్లియర్ చేసి తుది జాబితాలో సెలెక్ట్ అవ్వని అభ్యర్థుల డేటాను నిల్వ చేస్తుంది. ఈ పోర్టల్‌లో పది వేల మందికి పైగా అలాంటి ప్రతిభావంతులైన వారి డేటా ఉంది.
- మధ్యప్రదేశ్‌లోని షాడోల్ గ్రామం – ఫుట్‌బాల్ క్రేజ్ గ్రామంగా పిలవబడుతోంది.
- బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని రతన్‌పురా గ్రామంలో నివసిస్తున్న దేవకీ ని ఇప్పుడు సోలార్ దీదీ అని పిలుస్తారు.
- ఇటలీలోని క్యాంప్-రొటోండో అనే చిన్న పట్టణంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
- కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మీరా స్టార్స్ & కాస్మిక్ ఎక్స్‌పాన్షన్ రేట్‌పై IUCAA అధ్యయనం (హబుల్ స్థిరాంకం)
- ప్రొఫెసర్ అనుపమ్ భరద్వాజ్ (IUCAA) నేతృత్వంలోని బృందం విశ్వ దూర నిచ్చెనను మెరుగుపరచడానికి మన గెలాక్సీలోని 18 సమూహాలలో ఆక్సిజన్ అధికంగా ఉండే 40 మీరా వేరియబుల్ నక్షత్రాలను ఉపయోగించింది.
- ఆక్సిజన్ అధికంగా ఉండే మీరా నక్షత్రాలు.
- మీరా నక్షత్రాలు పురాతనమైనవి, వాటి చివరి జీవిత దశలలో మెరుస్తూ ఉంటాయి.
- ఇవి ఒక లయ పద్దతిలో మెరుస్తూ ఉంటాయి (అవి హృదయ స్పందనలా పల్సేట్ అవుతాయి).
- ఈ మైరా నక్షత్రాలను ఉపయోగించి, వారు హబుల్ స్థిరాంకం (H₀)ని తిరిగి లెక్కించారు.
హబుల్ స్థిరాంకం (H₀) అంటే ఏమిటి?
- హబుల్ స్థిరాంకం అనేది విశ్వం విస్తరిస్తున్న రేటును సూచించే విలువ, ముఖ్యంగా విశ్వ విస్తరణ కారణంగా సుదూర గెలాక్సీలు మన నుండి ఎంత వేగంగా దూరంగా కదులుతున్నాయో కొలుస్తుంది. ఇది విశ్వం యొక్క స్పీడోమీటర్ లాంటిది.
మీరా స్టార్స్
- మీరా (Omicron Ceti) అనేది మొట్టమొదటిగా కనుగొనబడిన వేరియబుల్ స్టార్, 17వ శతాబ్దం నుండి దాని మారుతున్న ప్రకాశానికి ప్రసిద్ధి చెందింది.
- మీరా వేరియబుల్స్ అనేది 100–1,000 రోజుల చక్రాలలో విస్తరిస్తుంది మరియు సంకోచించే చివరి దశలలో చల్లని, పెద్ద నక్షత్రాలు.
- వాటి ప్రకాశం వాటి పల్సేషన్ కాలంతో బలంగా ముడిపడి ఉంది, కాస్మిక్ దూరాలను కొలవడానికి ప్రామాణిక కొవ్వొత్తులుగా ఉపయోగపడుతుంది.
డిజిటల్ ఇండియా మైలురాయి
- NeGD డిజిలాకర్ మరియు ఇ-డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 2,000 ఇ-గవర్నమెంట్ సర్వీస్‌ల పాన్-ఇండియా ఇంటిగ్రేషన్‌ను సాధించింది.
- మొత్తం 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పౌరులు ఇప్పుడు సర్టిఫికెట్‌లు, సంక్షేమ పథకాలు, యుటిలిటీ చెల్లింపులు మరియు మరిన్ని సిటిజన్ సెంట్రిక్ సేవలను ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు.
- అత్యధిక సంఖ్యలో సేవలను అందిస్తున్న టాప్ 3 రాష్ట్రాలు: మహారాష్ట్ర (254), ఢిల్లీ (123), కర్ణాటక (113), ఆంధ్రప్రదేశ్‌లో (76).
NeGD (నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్) గురించి
- నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2009లో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద స్వతంత్ర వ్యాపార విభాగంగా రూపొందింది.
- నేషనల్ పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను NeGD అభివృద్ధి చేసింది
- డిజిలాకర్, ఎంటిటీ లాకర్, ఉమాంగ్, ఓపెన్‌ఫోర్జ్, API సేతు, మై స్కీమ్, ఇండియా స్టాక్ గ్లోబల్, మేరీ పెహ్‌చాన్, UX4G.
- NeGD సుస్థిర అభివృద్ధి లక్ష్యం (SDG) 16 ను సాధించేందుకు నేరుగా దోహదపడుతుంది.
112 జన్ రక్షక్ డయల్
- అహ్మదాబాద్‌లో డయల్ 112 కింద జనరక్షక్ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు.
- ఇప్పుడు ప్రజలు కేవలం ఒక నంబర్, 112కు డయల్ చేయడం ద్వారా చాలా తక్కువ సమయంలో విపత్తు నిర్వహణ, చైల్డ్ హెల్ప్‌లైన్, మహిళా హెల్ప్‌లైన్, అగ్నిమాపక సేవ, అంబులెన్స్ మరియు పోలీసు సహాయం వంటి భద్రతా సంబంధిత సేవలను పొందుతారు.
హిందూ కరెంట్ అఫైర్స్
బీసీలకు 42% కోటా బిల్లును తెలంగాణ రాష్ట్రం ఆమోదించింది
తెలంగాణ మునిసిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు, 2025 మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ (మూడవ సవరణ) చట్టం, 2025 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ)లకు 42% రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది.
క్లౌడ్‌బర్స్ట్ అంటే ఏమిటి?
- క్లౌడ్‌బర్స్ట్ అనేది తక్కువ వ్యవధిలో కురిసే విపరీతమైన అవపాతం, కొన్నిసార్లు వడగళ్ళు మరియు ఉరుములతో కూడి ఉంటుంది, ఇది వరద పరిస్థితులను సృష్టించగలదు.
- క్లౌడ్‌బర్స్ట్‌లు చాలా అరుదుగా ఉంటాయి, ఎందుకంటే అవి ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ద్వారా లేదా అప్పుడప్పుడు ఒక వెచ్చని గాలి చల్లటి గాలితో కలిసినప్పుడు మాత్రమే సంభవిస్తాయి, ఫలితంగా ఆకస్మిక ఘనీభవనం ఏర్పడుతుంది.
- భారత వాతావరణ శాఖ (IMD) వర్షపాతంను క్లౌడ్‌బర్స్ట్‌గా వర్గీకరించడానికి రెండు షరతులను నిర్దేశించింది:
- వర్షపాతం తీవ్రత: గంటకు 100 మిల్లీమీటర్లు (10cm) లేదా అంతకంటే ఎక్కువ కురిసే వర్షం.
- భౌగోళిక ప్రాంతం: తీవ్రమైన వర్షపాతం తప్పనిసరిగా ఒక చిన్న ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండాలి, సాధారణంగా సుమారుగా 20 నుండి 30 చదరపు కిలోమీటర్ల వరకు ఉండాలి.
తమిళనాడు రాష్ట్రం పురావస్తు అన్వేషణ ప్రారంభించింది
- తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ సెప్టెంబర్ 2025 రెండవ వారంలో నీటి అడుగున పురావస్తు పరిశోధనలను ప్రారంభించనుంది.
- ఈ ప్రదేశాలు పూంపుహార్ (కావేరిపూంపట్టినం) మరియు నాగపట్నం మధ్య తీరంలో ఉన్నాయి.
- పూంపుహార్ (కావేరీపూంపట్టినం): ప్రారంభంలో చోళుల రాజధాని మరియు అభివృద్ధి చెందుతున్న పురాతన ఓడరేవు నగరం.
- నాగపట్నం: ఆగ్నేయాసియాతో సంబంధాలు కలిగిన ప్రధాన మధ్యయుగ వాణిజ్య కేంద్రం.
ఇండియన్ రోజ్‌వుడ్ (డాల్బెర్జియా లాటిఫోలియా)
- బెంగుళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IWST) డేటా ప్రకారం, డాల్‌బెర్జియా లాటిఫోలియా (ఇండియన్ రోజ్‌వుడ్) కోసం భారతదేశం యొక్క అనువైన నివాస స్థలంలో కేవలం 17.2% మాత్రమే రక్షిత ప్రాంతాలలో ఉన్నాయి.
- భారతీయ రోజ్‌వుడ్, దీనిని “ఐవరీ ఆఫ్ ది ఫారెస్ట్స్” అని కూడా పిలుస్తారు. ఇది ఫర్నిచర్, హస్తకళలు మరియు నైట్రోజన్ ఫిక్సర్ మరియు కార్బన్ సింక్ లో చాలా ఉపయోగపడుతుంది.
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క అధ్యయనాలు (2019–2025) లో గణనీయమైన క్షీణతను చూపుతున్నాయి: కర్ణాటకలో (6.19) మరియు కేరళలో (5.38)తో పోలిస్తే తమిళనాడులో 0.1 హెక్టారుకు కేవలం 2.85 చెట్లు నమోదయ్యాయి.
రామన్ మెగసెసే అవార్డు 2025
- Educate Girls, ఒక భారతీయ సంస్థ, రామన్ మెగసెసే అవార్డు 2025కు ఎన్నికైంది .
- ఇతర విజేతలు:
- షాహినా అలీ (మాల్దీవులు) – పర్యావరణ కార్యకర్త.
- ఫ్లావియానో ఆంటోనియో ఎల్. విల్లానువా (ఫిలిప్పీన్స్)
- అవార్డు గురించి:
- ఈ అవార్డు 1958లో స్థాపించబడింది. ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించబడుతుంది.
ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి పథకం
- యూనియన్ బడ్జెట్ 2024–25 లో ప్రారంభించబడింది మరియు PM 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు.
- ఖర్చు: ₹1 లక్ష కోట్లు.
- లక్ష్యం: రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించడం.
ముఖ్యమైన ఫీచర్లు
- ద్వంద్వ ప్రోత్సాహకాలు:
- పార్ట్ A (కార్మికులు): మొదటి సారిగా ఎంపికైన ఉద్యోగులకు ₹15,000 (రెండు వాయిదాలు).
- పార్ట్ B (యజమానులు): ప్రతి ఒక ఉద్యోగి నియామకం కు నెలకు ₹3,000 వరకు యొక్క ప్రోత్సాహకం.
రాయ్‌పూర్‌లోని పోలీస్ కమిషనరేట్ వ్యవస్థ
- 2025 స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాయ్‌పూర్‌లో పోలీస్ కమిషనరేట్ వ్యవస్థను అమలు చేస్తామని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు.
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ విధానాన్ని అవలంబిస్తున్న మొదటి నగరం రాయ్‌పూర్.
చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్
- ఇంతకు ముందు (CrPC కింద): 10 లక్షలు కంటే ఎక్కువ జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రమే (2011 జనాభా లెక్కలు) పోలీసు కమీషనర్ ఉండవచ్చు.
- కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023 ఈ నిబంధనను తొలగించింది.
- రాష్ట్రాలు ఇప్పుడు SP-ర్యాంక్ అధికారి లేదా అంతకంటే ఎక్కువ అధికారాలు అప్పగించవచ్చు.
- BNSS యొక్క సెక్షన్లు 14 & 15 వీటికి సంబంధించినవి.
జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర హోదా
- జహూర్ అహ్మద్ భట్ vs జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క కేసు లో జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం పై సుప్రీం కోర్ట్ కేంద్రం నుండి వివరణ కోరింది.
- వాదన: రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో వైఫల్యం పౌరుల హక్కులు, సమాఖ్యవాదం మరియు తద్వారా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం వాటిని ఉల్లంఘిస్తుంది.
రాజ్యాంగ నేపథ్యం
- రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను మూడు ప్రక్రియలలో ఏర్పాటు చేయబడుతుంది:
- ప్రవేశం (Admission) – ఉదా., ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ (1947) ద్వారా J&K భారతదేశంలోకి రాష్ట్రం అయ్యింది.
- స్థాపన (Establishment) – అంతర్జాతీయ చట్టంలో (ఉదా., గోవా, సిక్కిం) సముపార్జన ద్వారా.
- నిర్మాణం (Formation) – ఆర్టికల్ 3 ప్రకారం పునర్వ్యవస్థీకరణ (ప్రాంతం, సరిహద్దులు లేదా రాష్ట్రాల పేరును మార్చడం. ఉదా: ఆంధ్ర ప్రదేశ్).
- ఆర్టికల్ 3 రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడానికి పార్లమెంటును అనుమతిస్తుంది కానీ, రాష్ట్రాన్ని శాశ్వతంగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి అనుమతించరు.
- భారతదేశ సమాఖ్య రూపకల్పన:
- రాజ్యాంగం “యూనియన్ ఆఫ్ స్టేట్స్” (ఆర్టికల్ 1) అనే పదాన్ని ఉపయోగిస్తుంది , ఫెడరేషన్ కాదు.
- సమాఖ్య లక్షణాన్ని కొనసాగిస్తూ ఐక్యతను నిర్ధారిస్తుంది.
- ఫెడరలిజంలో భాగం ప్రాథమిక నిర్మాణం.
- రాజ్యసభ (ఆర్టికల్ 83) శాశ్వతమైనది → రాష్ట్రాల ప్రాతినిధ్యానికి హామీ ఇస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ కరెంటు అఫైర్స్
కర్నూలు ఐఐఐటీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచింది
సింగపూర్‌లో జరిగిన వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024లో కర్నూలు ఐఐఐటీ 9వ స్థానంలో నిలిచింది. ఐఐఐటీ కర్నూలు వివిధ దేశాలకు చెందిన 760 సంస్థలతో పోటీ పడి 9వ స్థానంలో నిలిచింది.
Download Today Current Affairs in Telugu PDF
Disclaimer: The subheading “Hindu Current Affairs” used in this article refers only to current affairs content sourced from The Hindu Newspaper. This section is provided solely for educational and informational purposes to assist competitive exam aspirants in their preparation. We do not claim ownership of the original reporting, and all credit belongs to The Hindu.