Current Affairs in Telugu 15 September 2025
Table of Contents
PIB కరెంట్ అఫైర్స్
మిజోరంలో ప్రధాని పర్యటన
బైరాబీ-సాయిరాంగ్ కొత్త రైలు మార్గాన్ని (~51.38 కి.మీ; 45 సొరంగాలు, 55 పెద్ద + 88 చిన్న వంతెనలు) మరియు సాయిరాంగ్-ఢిల్లీ (ఆనంద్ విహార్) రాజధాని, సాయిరాంగ్-గౌహతి, సాయిరాంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర రాజధాని ప్రాంతం (సైరాంగ్, ఐజ్వాల్ సమీపంలో) జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడింది.
రైలు, రోడ్లు (ఐజ్వాల్ బైపాస్, థెన్జాల్-సియాల్సుక్, ఖాన్‌కౌన్-రోంగురా), శక్తి (LPG బాట్లింగ్ ప్లాంట్), క్రీడలు (ఖేలో ఇండియా హాల్), మరియు విద్య (EMRS & PMJVK పాఠశాలలు)లో ₹9,000+ కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.
మణిపూర్‌లో ప్రధాని పర్యటన
- చురచంద్‌పూర్‌లో ₹7,300+ కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన.
- మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీ & ఆస్తి నిర్వహణ (~₹3,600 కోట్లు), 5 నేషనల్ హైవే ప్రాజెక్ట్‌లు (₹2,500+ cr), MIND (మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్) మరియు 9 స్థానాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ప్రారంభించారు.
- రైలు కనెక్టివిటీ విస్తరణ: జిరిబామ్-ఇంఫాల్ రైలు మార్గం (పెట్టుబడి ~₹22,000 కోట్లు) ఇంఫాల్‌ను జాతీయ నెట్‌వర్క్‌కు కలుపుతుంది.
అస్సాంలో ప్రధాని పర్యటన
- అస్సాంలోని గోలాఘాట్ వద్ద నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ (NRL)లో అస్సాం బయోఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించి, పాలీప్రొఫైలిన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు ప్రధాన మంత్రి.
- మా కామాఖ్యా దేవి కారిడార్.
- అస్సాంకు చెందిన గొప్ప యోధుడు వీర్ లచిత్ బోర్ఫుకాన్.
- శివసాగర్‌లోని రంగ్ ఘర్ చారిత్రక ప్రదేశం అస్సాంలో ఉంది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025
- లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత బాక్సర్ మినాక్షి 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
- భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
హిందీ దివస్ – 14 సెప్టెంబర్
హిందీ దివస్ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 న జరుపుకుంటారు. ఈ రోజు ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక భాషల్లో ఒకటిగా హిందీ ని స్వీకరించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు. మున్షీ-అయ్యంగార్ ఫార్ములా ద్వారా హిందీ అధికారిక భాషగా నిర్ణయించబడింది, ముసాయిదా కమిటీ సభ్యులు K. M. మున్షీ మరియు N. గోపాలస్వామి అయ్యంగార్, భారత రాజ్యాంగ సభ ద్వారా ఓటు వేయబడిన తర్వాత హిందీ అధికార భాష గా తీసుకోబడింది.
అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (IEC) 89వ సాధారణ సమావేశం
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2025 సెప్టెంబర్ 15 నుండి 19 వరకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (IEC) 89వ సాధారణ సమావేశాన్ని (GM) భారతదేశం నిర్వహిస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకటించింది. 1960, 1997 మరియు 2013 తర్వాత భారతదేశం ప్రతిష్టాత్మకమైన IEC జనరల్ మీటింగ్‌ను నిర్వహించడం ఇది నాల్గవసారి. ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఫోస్టరింగ్ ఎ సస్టైనబుల్ వరల్డ్. ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (IEC) ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మరియు సంబంధిత టెక్నాలజీల కోసం అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది.
భారతదేశం మరియు గ్రీస్ మధ్య తొలి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం
ఇండియన్ నేవీకి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ త్రిఖండ్ సలామిస్ బే పోర్ట్‌లో భారతదేశం మరియు గ్రీస్ మధ్య తొలి ద్వైపాక్షిక సముద్ర విన్యాసాల్లో పాల్గొంటోంది.
హిందూ కరెంట్ అఫైర్స్
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డి.డి. లపాంగ్ మరణించారు
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డోన్వా డెత్వెల్సన్ లాపాంగ్ ష్లాంగ్‌లో కన్నుమూశారు.
భూపేన్ హజారికా 100వ జయంతి
భూపేన్ హజారికా 100వ జయంతి సందర్భంగా ప్రధాని పాల్గొన్నారు. అస్సాంలో భూపేన్ హజారికా ప్రసిద్ధ పాటలు ‘సుధాకాంత’ (అమృతం-గాత్రం) మరియు ‘బర్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర’.
ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ యాక్ట్, 2025
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఇటీవల ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ యాక్ట్, 2025 అమలులో ఉన్న రూల్స్, ఆర్డర్ మరియు మినహాయింపు ఉత్తర్వు ను నోటిఫై చేసింది. ఇది పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం, 1920; విదేశీయుల నమోదు చట్టం, 1939; విదేశీయుల చట్టం, 1946 మరియు ఇమ్మిగ్రేషన్ (క్యారియర్స్ లయబిలిటీ) చట్టం, 2000 చట్టాలను రద్దు చేస్తోంది.
కొత్త రూల్స్:
- నియమాలు చట్ట పరమైన అధికారాన్ని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BOI) కు ఇస్తుంది. “ఇమ్మిగ్రేషన్ మోసం కేసులను పరిశీలించడానికి” మరియు విదేశీయుల కదలికలను గుర్తించడానికి, బహిష్కరించడానికి లేదా పరిమితం చేయడానికి మరియు ఇతరులతో పాటు ఇమ్మిగ్రేషన్ డేటాబేస్‌ను కొలేట్ చేయడానికి మరియు నిర్వహించడానికి దేశాలతో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమన్వయం చేస్తుంది. ఇంతకుముందు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BOI) చట్టపరమైన అధికారం లేదు.
- విదేశీయులందరి బయోమెట్రిక్ సమాచారాన్ని రికార్డ్ చేయడానికి చట్టపరమైన సదుపాయాన్ని ఈ నియమం అందిస్తోంది.
- విద్యా సంస్థలు విదేశీ విద్యార్థులందరి గురించి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కి తెలియజేయాలి మరియు హాజరు వివరాలు మరియు “సాధారణ ప్రవర్తన” నివేదిక వంటి సెమిస్టర్ వారీగా “విద్యా పనితీరు” సారాంశాన్ని కూడా అందించాలి.
- ఇంతకుముందు అస్సాం రాష్ట్రం లో ఫారినర్స్ ట్రిబ్యునల్స్ (FT) కు అధికారాలు ఉండేవి. ప్రస్తుతం అధికారాలు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌కు ఇవ్వబడ్డాయి. అస్సాంలో మొత్తం 100 FTలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. FTలు అస్సాంలో మాత్రమే పనిచేస్తాయి. ఇతర రాష్ట్రాల్లో, అక్రమ వలసదారుని స్థానిక కోర్టు ముందు హాజరు పరుస్తారు.
- ఇండియన్ కోస్ట్ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు అస్సాం రైఫిల్స్ కూడా అక్రమ వలసదారుల బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించడం ద్వారా వారిని నిరోధించడానికి చట్టబద్ధంగా అనుమతించబడ్డాయి. ఇంతకు ముందు ఈ దళాలు గృహ మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక ఆదేశాలను కలిగి ఉండేవి.
- ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ (మినహాయింపు) ఆర్డర్, 2025: ఈ ఉత్తర్వు చట్టంలోని నిబంధనల నుండి నేపాల్, భూటానీస్ మరియు టిబెటన్లకు మినహాయింపు ఇస్తుంది. జనవరి 9, 2015 వరకు భారతదేశంలో ఆశ్రయం పొందిన రిజిస్టర్డ్ శ్రీలంక తమిళ జాతీయులు 2025 చట్టంలోని సెక్షన్ 3 (పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రం లేదా వీసా ఆవశ్యకత)లోని ఉప-విభాగాలు (1), (2) మరియు (3) నిబంధనల నుండి మినహాయించబడ్డారు. డిసెంబర్ 31, 2024లోపు పాస్‌పోర్ట్‌లు లేదా వీసాలు లేకుండా లేదా గడువు ముగిసిన ప్రయాణ పత్రాలతో భారతదేశంలోకి ప్రవేశించినట్లయితే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్‌లోని ఆరు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన నమోదుకాని సభ్యులకు శిక్షాపరమైన నిబంధనలు మరియు బహిష్కరణ నుండి మినహాయింపును కూడా నోటిఫికేషన్ అందిస్తుంది.
చార్లెస్ జేమ్స్ కిర్క్ చనిపోయాడు
సెప్టెంబరు 10న ఉటాలో జరిగిన యూనివర్శిటీ ఈవెంట్‌లో చార్లెస్ జేమ్స్ కిర్క్ అనే సంప్రదాయవాద కార్యకర్త కాల్చి చంపబడ్డాడు. కిర్క్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర గౌరవమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేయనున్నట్లు USA ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అతన్ని “ఇజ్రాయెల్ యొక్క సింహ-హృదయ స్నేహితుడు” అని ప్రశంసించారు.
Download Today Current Affairs in Telugu PDF
Disclaimer: The subheading “Hindu Current Affairs” used in this article refers only to current affairs content sourced from The Hindu Newspaper. This section is provided solely for educational and informational purposes to assist competitive exam aspirants in their preparation. We do not claim ownership of the original reporting, and all credit belongs to The Hindu.